ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లో కనబడాలి కాని.. 'ఉప్పెన' ట్రైలర్ అదిరింది..!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.. బుచ్చి బాబు సన డైరక్షన్ లో ఉప్పెన మూవీతో తెరంగేట్రం చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఉప్పెన సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేశారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.

ఉప్పెన ట్రైలర్ చూస్తే మనసుకి హత్తుకునే ఓ ప్రేమ కావ్యంగా సినిమా ఉంటుందని అనిపిస్తుంది. సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్ చివర్లో ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లో కనబడాలి కాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇల్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ అని చెప్పే డైలాగ్ సినిమా కంటెంట్ ఏంటన్నది అర్ధమయ్యేలా చెబుతుంది. సినిమా క్లైమాక్ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుందని టాక్. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న ఉప్పెన సినిమాపై రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచిందని చెప్పొచ్చు.