
యువ హీరో రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పవర్ ప్లే. ఎప్పుడూ ప్రేమకథలతో సినిమాలు చేసే రాజ్ తరుణ్ కెరియర్ లో మొదటిసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. విజయ్ కుమార్, రాజ్ తరుణ్ లాస్ట్ ఇయర్ ఒరేయ్ బుజ్జిగా సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆ కాంబినేషన్ లో పవర్ ప్లే సినిమా వస్తుంది. సినిమాలో హేమల్ హీరోయిన్ గా నటిస్తుండగా పూర్ణ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో రాజ్ తరుణ్ లుక్ కూడా కొత్తగా ఉంది.
రీసెంట్ గా మొదలు పెట్టిన ఈ సినిమా రెండు షెడ్యూళ్లలోనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈమధ్య వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా ఓటిటిలో రిలీజై ప్రేక్షకులను మెప్పించగా పవర్ ప్లేతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.