రాజ'శేఖర్' ఫస్ట్ లుక్..!

యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమాకు శేఖర్ టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో రాజశేఖర్ మిడిల్ ఏజ్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ముందు నీలకంఠని డైరక్టర్ గా అనుకున్నారు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నీలకంఠ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. కొత్త దర్శకుడికి డైరక్షన్ బాధ్యతలు అప్పచెప్పినట్టు టాక్. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా శేఖర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

కల్కి సినిమా తర్వాత రాజశేఖర్ చేస్తున్న శేఖర్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ ఈ సినిమాలో కనిపిస్తారట. మరి రాజశేఖర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన రాజశేఖర్ కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ శేఖర్ తో తన మార్క్ చూపించాలని చూస్తున్నారు.