
అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తుంది. ఫీమేల్ లీడ్ సినిమాలకు ఇప్పుడు సమంత మొదటి ఆప్షన్ అయ్యింది. ఓ బేబీ హిట్ తో సమంత అలాంటి కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆల్రెడీ కన్నడ డైరక్టర్ తో ఓ సినిమా ప్లాన్నింగ్ లో ఉన్న సమంత గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుతలం సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. గుణశేఖర్ శాకుతల పాత్రలో సమంత కెరియర్ లో మొదటిసారి ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాలో సమంతతో పాటుగా లక్కీ ఛాన్స్ పట్టేసింది ఈషా రెబ్బ. తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ సోలో సినిమాలు చేస్తూనే అడపాదడపా స్టార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా శాకుంతలం సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రకు ఈషా రెబ్బను సెలెక్ట్ చేశారట. పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటు ఈషా రెబ్బ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా భారీగానే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.