
అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. అసలైతే ఈ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని అనుకోగా పోటీ ఎక్కువవడం వల్ల సమ్మర్ కు వాయిదా వేశారు. ఫిబ్రవరి నుండి ఆగష్టు వరకు వారానికో సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అందుకే ఫైనల్ గా అఖిల్ మూవీని జూన్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు.
అఖిల్, పూజా హెగ్దేల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను మూడు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు అందుకే ఈసారి పక్కా హిట్ టార్గెట్ తో బ్యాచ్ లర్ మూవీ వస్తుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మరో మాస్ మూవీ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.