మహేష్ సినిమా ఛాన్స్ అందుకున్న మోనాల్..!

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ సరసన మహాంటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ తో పాటు బిగ్ బాస్ క్రేజీ బ్యూటీ మోనాల్ గజ్జర్ కూడా సర్కారు వారి పాటలో ఉంటుందట. అయితే మోనాల్ కేవలం ఓ సాంగ్ మాత్రమే చేస్తుందని తెలుస్తుంది. అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మోనాల్ తెలుగులో ఐదారు సినిమాలు చేసింది. పెద్దగా అవకాశాలు లేకపొవడంతో కెరియర్ లో వెనకపడ్డ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మళ్లీ పాపులారిటీ పెంచుకుంది.

బిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్ వీక్ కు ముందు ఎలిమినేట్ అయ్యింది మోనాల్. 90 రోజులకు పెగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అమ్మడు ప్రేక్షకులను అలరించింది. స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో జడ్జ్ గా ఛాన్స్ అందుకున్న మోనాల్.. సంక్రాతికి వచ్చిన బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. రంభ ఊర్వశి మేనక అంటూ ఆడియెన్స్ ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది మోనాల్. ఇక సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాటలో కూడా మోనాల్ స్పెషల్ ఐటం సాంగ్ ఉంటుందని అంటున్నారు.

కెరియర్ దాదాపు ముగిసింది అనుకున్న టైంలో మోనాల్ కు ఇలా వరుస అవకాశాలు రావడం నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ కు ముందు ఆమెను ఎవరు పట్టించుకోలేదు బిగ్ బాస్ నుండి అలా బయటకు వచ్చిందో లేదో అమ్మడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయ్యింది.