ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో అగ్నిప్రమాదం..!

ప్రభాస్ డైరెక్ట్ హిందీలో చేస్తున్న మొదటి సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీ సీరీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. మంగళవారం మొదలైన ఈ సినిమా షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబాయ్ లోని గుర్గావ్ లో ఆదిపురుష్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేయగా ఆ సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.   


అదృష్టం ఏంటంటే ఆ సెట్ లో చిత్రయూనిట్ ఎవరు లేరు.. కేవలం సెట్ మాత్రమే మటల్లో కాలిపోయింది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. రావణాసురుడుగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నాడు. సెట్ లో అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. భారీ ఖర్చుతో వేసిన సెట్ లో అగ్నిప్రమాదం చిత్రయూనిట్ ను షాక్ అయ్యేలా చేసింది. సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ ఓ పక్క ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ చేస్తూ ఆదిపురుష్ కు డేట్స్ ఇచ్చాడు. ప్రభాస్ నటించిన రాధే శ్యాం ఈ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేశారు. రాధే శ్యాం సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటుంది.