యుద్ధం లేని మహా భారతం ఊహించుకుంటే.. కార్తీ సుల్తాన్ టీజర్ అదుర్స్..!

కోలీవుడ్ యువ హీరో కార్తీ లీడ్ రోల్ లో బక్కియ రాజ్ కన్నన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సుల్తాన్. కార్తీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ లో సినిమా కథ రివీల్ చేయకపోయినా మహాభారతం గురించి హీరో చెప్పిన డైలాగ్ మాత్రం అదిరిపోయింది. మ‌హాభారతం చ‌దివావా..? భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వ‌మంటోంది ఒక్క అవ‌కాశ‌మే క‌దా. ఇస్తా అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ అంటాడు.. దానికి హీరో కార్తీ.. మ‌హా భార‌తంలో కృష్ణుడు పాండ‌వుల వైపు నిలుచున్నాడు. అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే..? అదే మ‌హాభార‌తాన్ని ఒక‌సారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్ అంటూ బదులిస్తాడు.

అసలు యుద్ధం లేని మహాభారతం.. కౌరవుల వైపు కృష్ణుడు ఎవరికి రాని కొత్త ఆలోచనలతో.. మాటలతో టీజర్ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్ కన్నన్. సినిమాలో కె.జి.ఎఫ్ విలన్ రామచంద్రరాజు నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న సుల్తాన్ టీజర్ ఇంప్రెస్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.