
ఎక్కడనుంచో ఒక వైరస్ రావడం.. దాని వల్ల అన్ని రంగాలకు బిజినెస్ నష్టం జరగడం గురించి ఎవరైన ఊహిస్తారా.. అలా ఊహించకుండానే వచ్చిన కరోనా మహమ్మారి అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు 2020లో ఓ డిజాస్టర్ ఇయర్ అని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం స్థంభించిపోగా సినీ పరిశ్రమ మీద ఆ ఎఫెక్ట్ బాగా పడ్డది. 1,2 కాదు ఏకంగా 9 నెలల పాటు థియేటర్లు మూత పడి ఉన్నాయి.
లాస్ట్ ఇయర్ దసరా నుండి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయగా 2021 ఫిబ్రవరి 1 నుంచి 100 ఆక్యుపెన్సీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి సినిమాలన్ని సంగం థియేటర్లకే హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టాల్సి వచ్చింది. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీని పొడిగిస్తూ థియేటర్లపై ఆంక్షలను ఎత్తివేసి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇది రానున్న సినిమాలకు ఓ మంచి అవకాశమని చెప్పొచ్చు. అయితే సంక్రాంతి సినిమాలు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ వల్ల తక్కువ వసూళ్లను రాబట్టాయని అంటున్నారు కొందరు నిర్మాతలు. ఇప్పటికైనా 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇచ్చినందుకు సంతోషమని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఆమోదించినా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు రావాల్సి ఉన్నాయట. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీతో మళ్ళీ థియేటర్లు కళకళలాడబోతున్నాయన్నమాట.