
ఎనర్జిటిల్ స్టార్ రామ్ కాస్త ఇస్మార్ట్ శంకర్ హిట్ తో రెడ్ సినిమాకు వచ్చేసరికి ఉస్తాద్ రామ్ గా మారాడు. యువ హీరోల్లో తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న రామ్ ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రంతో రామ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే త్రివిక్రంతో సినిమా డిస్కషన్స్ లోనే ఉందని తెలుస్తుంది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో కూడా రామ్ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం F3 సినిమా చేస్తున్న అనీల్ రావిపుడి ఆ సినిమాను ఆగష్టు 27న రిలీజ్ ప్లాన్ చేశారు. F3 తర్వాత అనీల్, రామ్ కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమా రవితేజ కన్నా ముందు రామ్ తోనే చేయాలని అనుకున్నాడు అనీల్ రావిపుడి కాని ఎందుకో అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయడం కుదరలేదు. అందుకే ఇప్పుడు రామ్ పటాస్ డైరక్టర్ తో సినిమా అంటే రెడీ అంటున్నాడు.
పటాస్ టు సరిలేరు నీకెవ్వరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనీల్ రావిపుడి తను తీసే సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కామెడీ మాత్రం సూపర్ గా ఉంటుంది. మరి రామ్ తో చేసే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. రామ్ ఎనర్జీకి అనీల్ రావిపుడి కామెడీ తోడైతే మరో సూపర్ హిట్ సినిమా రాం ఖాతాలో పడినట్టే.