
ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో యువ హీరో సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమాలో నటించింది నయనతార. సీనియర్ హీరోలకు ఆమె మొదటి ఆప్షన్ అవుతుంది. అందుకే నయనతారకే మెగా టీం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మళయాళంలో మోహన్ లాల్, పృధ్వి రాజ్ కలిసి నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అందుకుంది. కంటెంట్ బాగా నచ్చడంతో చిరు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే మళయాళ వర్షన్ లో హీరోయిన్ లేదు కాని తెలుగులో చిరు కోసం నయనతారని తీసుకొస్తున్నారు.
మెగాస్టార్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఉండాల్సిందే. అవి లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. లూసిఫర్ రీమేక్ ను ముందు సాహో డైరక్టర్ సుజిత్, ఆ తర్వాత వినాయక్ ఇలా ఇద్దరు ముగ్గురు దర్శకుల చేతులు మారి ఫైనల్ గా కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా చేతికి వచ్చింది. మోహన్ రాజా మళయాళ కథను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చినట్టు తెలుస్తుంది. ఆచార్య తర్వాత చిరు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.