వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బొనీ కపూర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఏప్రిల్ 9న పవన్ వకీల్ సాబ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది. 

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. అక్కడ అమితాబ్ చేసిన పాత్రని తెలుగులో పవన్ చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న సినిమానే అయినా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ హంగామా షురూ కానంది. అజ్ఞాతవాసితో మిస్సైన రికార్డులను ఈ సినిమాతో తీర్చేయాలని ఫిక్స్ అయ్యారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సినిమాలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా హిట్ అనిపించుకోనుంది.