కార్తికేయ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్..!

యువ హీరో కార్తికేయ ప్రస్తుతం చేస్తున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేస్తున్నారు. కార్తికేయ ఊర మాస్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా జబర్దస్త్ భామ అనసూయ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

బుల్లితెర మీద సత్తా చాటుతున్న అనసూయ ప్రత్యేకమైన సినిమాలతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తుంది. లేటెస్ట్ గా కార్తికేయతో అమ్మడు కాలు కదుపుతుందని తెలుస్తుంది. అనసూయకు ఉన్న క్రేజ్ కు సరైన ఐటం సాంగ్ పడాలే కాని కచ్చితంగా అమ్మడి రేంజ్ డబుల్ అవడం పక్కా అని చెప్పొచ్చు. ఈ సాంగ్ కోసం అనసూయ 20 లక్షల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా అనసూయ అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.