F3 బిజినెస్ డీటైల్స్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మూవీ F3. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సూపర్ హిట్ సీక్వల్ ఈమధ్యనే మొదలు పెట్టగా అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం F3 సినిమా ఆగష్టు 27న రిలీజ్ ప్లాన్ చేశారు. పటాస్ టూ సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఈ సినిమతో హ్యాట్రిక్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యాడు.  

ఇక సక్సెస్ ఫుల్ డైరక్టర్, సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కాబట్టి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ కూడా జరిగిపోయింది. F3 శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 25 కోట్ల బిజినెస్ చేసిందట. డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైం 12 కోట్లకు కోట్ చేసిందని తెలుస్తుంది. అంటే శాటిలైట్స్ 13 కోట్లకు ఇచ్చారన్నమాట. జీ తెలుగు F3 శాటిలైట్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి F2 మేనియా కొనసాగించడానికి F3 సిద్ధమవుతుందని చెప్పొచ్చు.