
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నారు. చిరు, చరణ్ ఇద్దరు మెగా ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఇక శుక్రవారం రిలీజైన టీజర్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. టీజర్ రిలీజైన 24 గంటల్లోనే 8 లక్షల దగ్గర వ్యూస్ తో హంగామా చేస్తుంది.
ఆచార్య టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు కొరటాల శివ. కొరటాల మార్క్ కంటెంట్ తో.. చిరు మార్క్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను మే 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరు, మణిశర్మ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది. ఆచార్య టీజర్ లో మణిశర్మ మార్క్ కనిపించింది. ఇక సినిమాకు అంతకుమించి అనిపించేలా మ్యూజిక్ ఇచ్చి ఉంటాడని అంచనా వేస్తున్నారు.