
సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన కె.వి గుహన్ మెగా ఫోన్ పట్టుకుని 118 సినిమా తీశారు. మొదటి సినిమానే హిట్ అందుకున్న గుహన్ తన డైరక్షన్ లో సెకండ్ మూవీగా డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు(WWW-Who, Where, why) సినిమా చేశాడు. 118 తరహాలోనే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ సినిమా తర్వాత గుహన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. విజయ్ ఇమేజ్ కు సరిపడే ఓ క్రేజీ స్టోరీ సిద్ధం చేశాడట గుహన్.
ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా పూర్తి కాగానే గుహన్ చెప్పే కథ నచ్చితే ఆయనతోనే సినిమా చేస్తాడని అంటున్నారు. గుహన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే స్టోరీ బాగా వచ్చి ఉండొచ్చని చెప్పొచ్చు. డబ్ల్యు, డబ్ల్యు, డబ్ల్యు హిట్ అయితే మాత్రం గుహన్ తో విజయ్ సినిమా ఫిక్స్ అయినట్టే.