
కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటు రాం చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. ఇక శుక్రవారం సాయంత్రం ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు. కొరటాల శివ మార్క్ కంటెంట్ తో పాటుగా మెగా మేనియా షురూ చేసేలా ఆచార్య టీజర్ ఉంది.
ధర్మస్థలిని కాపాడే వ్యక్తిగా చిరు కనిపించగా.. పాఠాలు చెప్పకపోయినా గుణపాఠాలు చెబుతానని ఆచార్య అంటారేమొ అని మెగాస్టార్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇక మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది. సైరా తర్వాత చిరు చేస్తున్న ఆచార్య మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.