RRR ఒలివియా ఫస్ట్ లుక్..!

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. రౌద్రం రణం రుధిరం టైటిల్ తో రాజమౌళి మార్క్ సినిమాగా వస్తున్న ఈ మూవీలో ఇద్దరు సూపర్ హీరోస్ నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు జక్కన్నతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చ్స్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో చరణ్ రామ రాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రతో వస్తున్నాడు.

ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడం ఫైటర్స్ ను ఓ కల్పిత కథతో ఒక దగ్గర చేసి ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు జక్కన్న. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుండి హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ లుక్ ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. సినిమాలో ఎన్.టి.ఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుంది. రామరాజుకి జతగా అలియా భట్ కనిపించనుంది. చరణ్, ఎన్.టి.ఆర్ మాత్రమే కాదు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు.