
సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. జి.ఎం.బి ప్రొడక్షన్స్ లో కూడా మహేష్ సహ నిర్మాతగా ఉంటూ రెమ్యునరేషన్ లేకుండా సినిమా బిజినెస్ లో వాటా తీసుకుంటాడని తెలుస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గా దుబాయ్ లో సైలెంట్ ఆ స్టార్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.
సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి అంటే సినిమాల పండుగ అన్నట్టే. అయితే ముందే సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేయడం మహేష్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ల విషయంలో క్లాషెస్ రాకుండా ముందు జాగ్రత్తగా సన్ర్కాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ సినిమా కన్ఫాం కాగా పోటీలో ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది.\
Sankranthi it is!!! 😊 #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @MythriOfficial pic.twitter.com/QkwE7glZTa