రానా 'విరాటపర్వం' రిలీజ్ డేట్ లాక్..!

నీది నాది ఒకే కథ సినిమాతో తన ప్రతిభ చాటుకున్న డైరక్టర్ వేణు ఊడుగుల తన నెక్స్ట్ సినిమాను రానాతో చేస్తున్నాడు. విరాటపర్వం అంటూ వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 

నక్సలైట్ రవన్న పాత్రలో రానా సర్ ప్రైజ్ చేయనున్నాడు. రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్న్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా షూటింగ్ చివరి దశకు రాగా ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. దగ్గుబాటి వారసుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయగల సత్తా తనకు ఉందని ప్రూవ్ చేసుకుంటున్నాడు రానా. విరాటపర్వంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.