
కళాశాల సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన మహి వి రాఘవ ఆనందో బ్రహ్మతో హిట్ అందుకుని వైఎస్సార్ జీవిత కథతో యాత్ర సినిమా చేశాడు. మళయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అందుకుంది. 70 ఎమెం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డు యాత్ర సినిమా నిర్మించారు. యాత్ర పార్ట్ 2 తీస్తానని ఎనౌన్స్ చేసిన మహి వి రాఘవ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి స్టార్ హీరోలతో క్రేజీ మల్టీస్టారర్ తీసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇద్దరిని కలిపి ఈ సినిమాలో నటింప చేయాలని చూస్తున్నాడు డైరక్టర్ మహి వి రాఘవ. ముందు అల్లు అర్జున్ తోనే సినిమా చేస్తాడని అనుకోగా విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతుందని అంటున్నారు. మొత్తానికి మహి వి రాఘవ తన నెక్స్ట్ సినిమాను భారీ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తుండగా.. విజయ్ దేవరకొండ లైగర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇద్దరు వారు కమిటైన సినిమాల తర్వాత మహి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.