
కరోనా లాక్ డౌన్ టైం లో స్టూడియోల్లోనే ఉన్న సినిమాలన్ని ఇప్పుడు థియేటర్ల బాట పడుతున్నాయి. ఏడాదికి వందల సినిమాలు రిలీజ్ అయ్యే తెలుగు పరిశ్రమలో ఏకంగా 9 నెలల దాకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవలేదు. కొన్ని సినిమాలు ఓటిటిని ఎంచుకున్నా కొన్ని మాత్రం థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేశాయి. ముఖ్యంగా వీటిలో స్టార్ సినిమాల కన్నా పదుల కొద్ది స్మాల్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయని చెప్పొచ్చు.
ఇక సంక్రాంతి నుండి వరుస సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా థియేటర్ లో సినిమా ఎక్స్ పీరియన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో ఆగిపోయిన సినిమాలన్ని వరుసబెట్టి రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గింది.. జనవరి నెల ఆఖరున సినిమాల సందడి మొదలైంది. జనవరి 29న ఒకటి రెండు కాదు ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా ఉంది. సుకుమార్ దగ్గర అసిస్టంట్ గా చేసిన మున్నా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఒక్క సాంగ్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా ఈ వారం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో ప్రదీప్ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఉంది.
ఇక మిగిలిన ఏడు సినిమాల్లో ఒకప్పటి హీరోయిన్ ఆమని నటించిన అమ్మదీవెన, తెలుగు క్యారక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ నటించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు. శ్రీకాంత్, సునీల్ నటించిన జైసేన ఉన్నాయి. వీటితో పాటు మిస్టర్ అండ్ మిస్, చెప్పినా ఎవరూ నమ్మరు, కళాపోషకులు సినిమాలు కూడా ఈ నెల 29నే వస్తున్నాయి. ఇవే కాకుండా జనావరి 30న హాలీవుడ్ డబ్బింగ్ మూవీ అమెరికన్ కమాండోస్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇనాళ్లు థియేటర్లో సినిమాలు లేక సినిమాలను మిస్సైన ప్రేక్షకులను ఒకేరోజు 7,8 సినిమాలు రిలీజ్ అవుతూ అలరించడానికి సిద్ధమయ్యాయి.