మాస్ రాజా పెంచేశాడట..!

మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ ఎనర్జీ ఏంటన్నది క్రాక్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు ఒక్క హిట్టు పడలేదు. అందుకే రవితేజ క్రాక్ హిట్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. డాన్ శీను, బలుపు, క్రాక్ లతో గోపీచంద్, రవితేజ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.

ఇక ఈ సినిమా హిట్ అవగానే రవితేజ తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. మొన్నటివరకు సినిమాకు 10 కోట్లు అటు ఇటుగా తీసుకునే మాస్ రాజా ఇప్పుడు సినిమాకు 14, 15 కోట్లు అంటున్నాడట. కరెక్ట్ సినిమా పడితే రవితేజ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది అన్నది క్రాక్ తో ప్రూవ్ చేశాడు. అందుకే అంతకుముందు రవితేజ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనుకడుగేసిన నిర్మాతలు కూడా ఇప్పుడు సైలెంట్ గా అతను అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్.