సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్..!

యువ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ లో హాకీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా A1 ఎక్స్ ప్రెస్. తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నా ఇంకా కెరియర్ లో నిలదొక్కుకోలేని సందీప్ కిషన్ ఈసారి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నాడని అనిపిస్తుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న A1 ఎక్స్ ప్రెస్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. సినిమాను దర్శన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి స్పోర్ట్స్ మెన్ గా మారడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది.. మధ్యలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. 

స్పోర్ట్స్ డ్రామా సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఈసారి సందీప్ కిషన్ సినిమా ఫలితం మీద నమ్మకంగా ఉన్నాడు. A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కోరుకునే కమర్షియల్ హిట్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.