రవితేజ 'ఖిలాడి' ఫస్ట్ లుక్ టీజర్..!

సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రవితేజ క్రాక్ సూపర్ హిట్ అందుకుంది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరక్క్కిన ఈ సినిమా కొన్నాళ్లుగా రవితేజ కోరుకుంటున్న హిట్ జోష్ ఇచ్చింది. రవితేజ సరసన శృతి హాసన్ నటించిన ఈ క్రాక్ సినిమాకు థమన్ మ్యూజిక్ అనించారు. క్రాక్ జోరు కొనసాగుతుండగానే మరో సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వదిలారు రవితేజ.

రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి అంటూ రాబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారట. ఈరో రవితేజ బర్త్ డే కానుకగా ఖిలాడి నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ తో చేతిలో ఇనుప రాడ్ తో రవితేజ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనిపించేలా ఉన్నాడు.