కెరియర్ లో చాలా ప్రత్యేకం జనతా గ్యారేజ్ : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఈ నెల 1న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, "ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడే వాడిని కాని ఈసారి మాటలకు అందని అనుభూతి ఈ సినిమా మిగిలించింది అందుకే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కెరియర్ లో 12 ఏళ్ల తర్వాత అమ్మానాన్నల పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ సక్సెస్ చాలా ప్రత్యేకం. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు నా పాదాభివందనం.." 

సినిమా దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన తారక్ సినిమా విజయంలో మోహన్ లాల్ గారి పాత్ర కూడా చాలా స్పెషల్ అని అన్నారు. ఇక జనతాకు పనిచేసిన మెకానిక్స్, టెక్నికల్ టీం, కో ఆర్టిస్ట్ అందరికి థాంక్స్ చెప్పిన జూనియర్ ఇన్నేళ్ల తన కెరియర్ లో హిట్ కొట్టినప్పుడు, ఫ్లాప్ ఫేస్ చేసినప్పుడు తన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు తన కృతజ్ఞతలు తెలియచేశాడు.

కొద్దికాలంగా తన రేంజ్ హిట్ అందుకోవడంలో వెనుక పడ్డ జూనియర్, జనతా గ్యారేజ్ తో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ హిట్ తో ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి అందరికి తెలిసింది. కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన జనతా గ్యారేజ్ తన జీవితంలో ప్రత్యేకమైన సినిమా అని అన్నారు.