వెంకటేష్ తో నిత్యా జోడి..!

బాబు బంగారం హిట్ తో బ్యాక్ టూ ఫాంలోకి వచ్చిన వెంకటేష్, ఇక నుండి వరుసెంట సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖదూస్ సినిమా రీమేక్ కు రెడీ అవుతున్న వెంకటేష్ ఆ తర్వాత ఓకే చేసిన కిశోర్ తిరుమల సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. కథాచర్చలు ముగిసిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా నిత్యా మీనన్ ను సెలెక్ట్ చేశారట దర్శక నిర్మాతలు. మలయాళ భామగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నిత్యా, మొదటి సినిమా నుండి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకుంది.

ఇక పాత్ర ప్రాధ్యాన్యత ఉన్న సినిమాలో హీరోయిన్ గా అది ఎంత చిన్న రోల్ అయినా సరే నటిస్తూ అలరిస్తున్న నిత్యా, ఇప్పుడు వెంకటేష్ తో నటించడం ఆమె కెరియర్ లోనే ఓ గొప్ప అవకాశం అని చెప్పాలి. ఇక నేను శైలజతో హిట్ అందుకున్న కిశోర్ ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా విక్టరీ వెంకటేష్ ను మెప్పించే కథతో సిద్ధమయ్యాడు. బాబు బంగారంతో తన మార్క్ ఎంటర్టైనర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, కిశోర్ సినిమాతో కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్నాడట.

కిశోర్ డైరక్షన్.. వెంకటేష్ తో నిత్యా జోడి ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవనుంది. ప్రస్తుతం సాలా ఖదూస్ సినిమా మీద దృష్టి పెట్టిన వెంకటేష్, ఈ సినిమా కోసం దేహదారుడ్యాన్ని కూడా పెంచుతున్నాడట. కొద్దిపాటి గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో కెరియర్ ప్లాన్ చేస్తున్న వెంకటేష్ ఆ సినిమాలతో ఏ రేంజ్ ఫలితాలను అందుకుంటాడో చూడాలి.