థమన్ కు మెగాస్టార్ ఛాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 153వ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఆ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ సినిమా తర్వాత చిరు లూసిఫర్ రీమేక్ గా ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. 

ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ సూపర్ ఫాం లో ఉన్న థమన్ కెరియర్ లో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ అందుకున్నాడు. ఏ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ ఎనీ కంప్యూసర్ అంటూ చిరు లూసిఫర్ కు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయాన్ని అఫీషియల్ గా చెప్పాడు.