RRR క్లైమాక్స్ షురూ..!

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్, కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబందించిన క్లైమాక్స్ షూటింగ్ ఆర్.ఎఫ్.సిలో జరుగుతుంది. ఈ క్లైమాక్స్ షూట్ ప్రారంభించాం అంటూ చిత్రయూనిట్ ట్విట్టర్ లో తెలిపింది. అందుకు సంబందించిన రామ రాజు, భీమ్ లు చేతులు కలిపిన ఒక ఫోటోని యాడ్ చేశారు.  

చరణ్, తారక్ ఇద్దరు పాల్గొనే ఈ క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై చరణ్ ఫుల్లీ ఛార్జెడ్ అని కామెంట్ చేయగా.. ఎన్.టి.ఆర్ సూపర్ ఎక్సైటెడ్ అని ట్వీట్ చేశారు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు రాజమౌళి. చూస్తుంటే ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి కాదు అంతకుమించిన సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు.