వరుణ్ తేజ్ 'గని'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ గని మోషన్ పోస్టర్ క్రేజీగా ఉంది. ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో గని సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గని తర్వాత వరుణ్ తేజ్ అనీల్ రావిపుడితో సూపర్ హిట్ మూవీ ఎఫ్2 సీక్వల్ మూవీ ఎఫ్3 చేస్తున్నాడు. ఈ సిన్మాను 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గని సినిమాను మాత్రం ఈ సమ్మర్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన దబాంగ్ 3 భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.