'ఆచార్య' టీజర్ కూడా అప్పుడే..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. సిద్ధ పాత్రలో చరణ్ కెరియర్ లో ఎప్పుడూ చేయని కొత్త పాత్రలో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. చిరు, చరణ్ ఈ ఇద్దరు చేసే హంగామా మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు. ఆచార్య సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటివరకు కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే వదిలిన చిత్రయూనిట్ జనవరి 26 రిపబ్లిక్ డే నాడు టీజర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. టీజర్ తో సినిమాపై పెంచాలని చూస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా సోషల్ మెసేజ్ తో వస్తున్నా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. ఆచార్య తో పాటుగా జనవరి 26న రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న RRR టీజర్ కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. సో రెండు భారీ సినిమాల టీజర్లు ఒకేరోజు రిలీజ్ అవడం విశేషం.