ఉప్పెన రిలీజ్ డేట్ లాక్..!

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమానే ఉప్పెన అంటూ క్రేజీ మూవీతో వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా రిలీజ్ కు ముందే పక్కా హిట్ అనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై బజ్ ఏర్పరిచాయి. లాస్ట్ ఇయర్ మార్చ్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. సంక్రాంతి సినిమాల మధ్య ఈ సినిమా ఎందుకని అనుకున్నారు ఫైనల్ గా ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఉప్పెన సినిమా రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ కానుంది. సినిమా నుండి వచ్చిన టీజర్ ఇప్పటికే సూపర్ అనిపించుకోగా తప్పకుండా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అవకుండానే క్రిష్ డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా పూర్తి చేశాడు. ఇక కృతి శెట్టి అయితే నాని శ్యాం సింగ్ రాయ్, సుధీర్ బాబు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబో మూవీ ఛాన్సులు అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమాకు సుకుమార్ సహ నిర్మాతగా ఉన్నారు. బుచ్చి బాబు డైరెక్ట్ చేయగా దేవి శ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజిక్ అందించారు.