
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి సినిమా చేస్తే.. ఇక ఆ సినిమా రికార్డులకు చిరునామాగా మారడం ఖాయం. పవన్ నిర్మాతగా చరణ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కాని లేటెస్ట్ గా పవన్, చరణ్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరిని డైరెక్ట్ చేసే సినిమాను కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తారని టాక్. సౌత్ స్టార్ డైరక్టర్స్ లో టాప్ 1, 2లో ఉన్న శంకర్ ఈమధ్య వెనకపడ్డారు.
ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న శంకర్ తన నెక్స్ట్ సినిమాను తెలుగులో తీయాలని ఫిక్స్ అయ్యారట. అదికూడా మెగా మల్టీస్టారర్ గా పవన్, చరణ్ ఇద్దరితో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే కథ సిద్ధం అవ్వగా ఇద్దరిని కలిసి స్క్రిప్ట్ వినిపించడం ఉందట. బాబాయ్ తో సినిమా చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమే అనేస్తున్న చరణ్ శంకర్ తో సినిమాకు సై అంటాడా లేదా అన్నది చూడాలి.