రాధే శ్యామ్ యూనిట్ కు ప్రభాస్ కానుకలు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ రాధే శ్యామ్ యూనిట్ కు రిస్ట్ వాచ్ లను గిఫ్టులుగా ఇచ్చాడని తెలుస్తుంది. 

ప్రభాస్ మనసు చాలా మంచిది.. అందుకే అతన్ని అందరు డార్లింగ్ అనేస్తారు. రాధే శ్యామ్ కు పనిచేసిన టీం అందరికి ప్రభాస్ సంక్రాంతి కానుకలు ఇచ్చాడట. ఖరీదైన రిస్ట్ వాచ్ అది కూడా ప్రభాస్ నుండి రావడంతో టీం అంతా సర్ ప్రైజ్ అయ్యారని తెలుస్తుంది. రాధే శ్యామ్ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కె.జి.ఎఫ్ చాప్ట 2, మెగాస్టార్ ఆచార్య, పవర్ స్టార్ వకీల్ సాబ్ కూడా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో ఏది  ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.