రియల్ హీరోస్ కు సెల్యూట్

ఎలాంటి స్వార్ధం లేకుండా దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ అందరికి దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి డ్యూటీని చేస్తున్న ఇండియ ఆర్మీకి ఆర్మీ డే సందర్భంగా తెలుగు స్టార్ హీరోలు మహేష్, ఎన్.టి.ఆర్ లు సెల్యూట్ చేశారు. ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజెన్లు కూడా వారికి వందనాలు తెలిపారు. ఆర్మీ డే సందర్భంగా కొందరు స్టార్స్ కూడా వారి స్పందన తెలియచేశారు.


ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా ఎన్.టి.ఆర్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. తిండి దొరికినా దొరక్కపోయినా.. కంటినిండా నిద్ర ఉన్నా లేకపోయినా ప్రేమించిన కుటుంబాల దగ్గరకు వెళ్తారో లేదో అనే స్థితిలో 365 రోజులు మనం సుఖంగా ఉండటం కోసం వాళ్ళ కుటుంబాలని వదిలేసి పహారా కాస్తున్నారు మన సైనికులు. ఒక్కసారి మనం అందరం కలిసి వారికి సెల్యూట్ చేద్దాం అన్నారు ఎన్.టి.ఆర్. సూపర్ స్టార్ మహేష్ కూడా యూనిఫార్మ్ లో ఉన్న మన హీరోలు నిస్వార్ధ సేవ చేస్తూ ఉన్నారు. వారి  త్యాగానికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.