ప్రభాస్ 'సలార్' మొదలు పెట్టారు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. సలార్ ఓపెనింగ్ ఈవెంట్ లో కె.జి.ఎఫ్ హీరో యశ్ కూడా పాల్గొన్నారు. కె.జి.ఎఫ్ సినిమాతో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ఈమధ్యనే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ తో మరోసారి తన టాలెంట్ చూపించాడు. కె.జి.ఎఫ్ 2 ఏప్రిల్ ఎండింగ్ లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. సలార్ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. 

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ కూడా లైన్ లో ఉంది. ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా ఆశించిన స్థాయిలో హిట్టయితే సలార్ కు క్రేజ్ డబుల్ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు.