వకీల్ సాబ్ టీజర్ వచ్చిందోచ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో క్రేజీగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. కోర్ట్ లో వాధించడము తెలుసు.. కోట్ తీసి కొట్టడము తెలుసు అంటూ పవర్ స్టార్ తన మార్క్ డైలాగ్ తో అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ కోసం ఎన్నాళ్ల నుండో ఎదుచూసిన ఫ్యాన్స్ కు ఈ టీజర్ స్పెషల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలకు ఎలాంటి లోటు లేదని టీజర్ తోనే చెప్పేశాడు డైరక్టర్. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా అదరగొట్టేందుకు వస్తున్నాడు. సమ్మర్ టార్గెట్ తో ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.