ఆచార్యలో రాం చరణ్ స్క్రీన్ టైం ఎంతంటే..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చరణ్ ఉంటాడని టాక్. అయితే కొరటాల శివ ఈ పాత్రను ముందు ఒక 10, 15 నిమిషాలు రాసుకోగా అది బాగా రావడంతో 40 నిమిషాల దాకా చేశారట. అది సరిపోదని ఫైనల్ గా 1 అవర్ స్క్రీన్ టైం రాం చరణ్ కు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

సినిమాలో చరణ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఆచార్య సినిమాలో మెగా తండ్రి కొడుకులు ఇద్దరు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.అర తో పాటుగా రాం చరణ్ ఈ సినిమాను చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తునారు. కాజల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమ్మార్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.