
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇజం. పూరి మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా వారెవా అనిపించేలా వదిలాడు పూరి. కళ్యాణ్ రామ్ ఏ సినిమాకు ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడలేదు.. అయితే అది పూరి ఇమేజ్ బట్టే అయినా కళ్యాణ్ రామ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ అంచనాలను మరింత పెంచేలా సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను దించుతున్నారట. టెంపర్, నాన్నకు ప్రేమతో రీసెంట్ గా వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ తో తారక్ రేంజ్ ఏంటో మరోసారి అందరికి తెలిసేలా చేశాడు. అయితే జూనియర్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కళ్యాణ్ రామ్ ఇజంలో తారక్ ను కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించే ప్లాన్ చేస్తున్నారట. పూరి ఇచ్చిన ఈ ఐడియా తమ్ముడికి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట కళ్యాణ్ రామ్.
మరి అన్న అడిగాక కాదంటాడా, అదీ కాక తారక్ తర్వాత సినిమా కూడా పూరి డైరక్షన్లోనే అంటూ వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ కమిట్మెంట్ కోసమైనా సరే ఇజంలో ఎన్టీఆర్ కనిపించే అవకాశాలున్నాయి. అసలే పూరి, ఆపైన ఇద్దరు నందమూరి హీరోలు, మరి చూస్తుంటే ఇజంతో పూరి మరోసారి తన సత్తా ఏంటో గట్టిగానే చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో పోకిరి మార్క్ కనిపించేలా చేసి మరోసారి ఇండస్ట్రీ రికార్డుల మీద తన సినిమా ఆధిపత్యం చెలాయించేలా చేస్తున్నాడు. మరి ఇజం అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూడాలి.