ఏంటీ 'రెడ్' ఏడు భాషల్లోనా..?

ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ అదే జోష్ తో రెడ్ సినిమాతో రాబోతున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. రామ్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన కిశోర్ తిరుమల రెడ్ మూవీని డైరెక్ట్ చేశారు. రెడ్ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ లో నటించారు. 

సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ ప్లాన్ చేసిన రామ్ రెడ్ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ముందు తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్న రామ్ రెడ్ సినిమాను ఏడు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మళయాళం, బెంగాలీ, భోజ్ పురి, మరాఠీతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారట. కన్నడలో ఈ సినిమాను ఈ నెల 14న రిలీజ్ ఫిక్స్ చేశారట. మిగతా భాషల్లో ఈ నెల చివరన రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.