అల్లు అర్జున్ అంటే ఇది..!

నిర్మాత తనయుడిగా షర్టు ప్యాంటు నలగకుండా.. పెద్దగా కష్టపడకుండా స్టార్ అవుదాం అనుకుంటే కుదరదు. తండ్రి పాపులారిటీ కొంతమేరకే పనిచేస్తుంది. అభిమానులను ఇంప్రెస్ చేయాలంటే ఒళ్ళు హూనం చేసుకోక తప్పదు. నిర్మాత తనయుడిగా అల్లు అర్జున్ సగటు హీరో కష్టపడిన దాని కన్నా ఎక్కువ కష్టపడతాడని ఇండస్ట్రీ టాక్. అందుకే మొదటి సినిమాలో అతన్ని చూసిన వారు ఇప్పుడు చూసి వావ్ అనేస్తున్నారు. తనని తాను మార్చుకుని తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ లాస్ట్ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

నాన్ బాహుబలి రికార్డులను సైతం తన పేరున రాసుకున్న బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో ఇంకా రికార్డులు కొడుతూనే ఉన్నాడు. ఆ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ సాధించింది. నేషనల్ వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా టాప్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో బుట్ట బొమ్మ చేరింది. ఇక ఇదే కాకుండా అల్లు అర్జున్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రాం లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించాడు. అల్లు అర్జున్ స్టామినా అంటే ఇదే అన్నట్టుగా రికార్డులు సృష్టిస్తున్నాడు బన్నీ.