గోపీచంద్ తోనే మారుతి.. 'పక్కా కమర్షియల్' కాంబో..!

ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తాడన్న మీడియా డిస్కషన్స్ తెలిసిందే. మాస్ మహరాజ్ రవితేజతో మారుతి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా మారుతి 10వ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. మారుతి డైరక్షన్ లో మాస్ హీరో గోపీచంద్ హీరోగా ఈ సినిమా వస్తుంది. మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్ లు కలిపి నిర్మిస్తున్నాయి అంటే సినిమా పక్కా హిట్ అన్నట్టే లెక్క. గోపీచంద్ మారుతి మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే కొత్త ప్రయత్నం చేశారు మారుతి. రావు రమేష్ లాయర్ గా మారుతి నెక్స్ట్ సినిమా గురించి మీడియా రాసిన వార్తలపై కోర్ట్ ఆర్డర్ వేస్తూ వచ్చినట్టుగా ప్రచారం మొదలు పెట్టారు. మరి ఎనౌన్స్ మెంటే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో చూడాలి.