
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు రెండు వారాల క్రితం కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ రాగా హోమ్ క్వారెంటైన్ లో ఉండి తగిన ట్రీట్మెంట్ తీసుకున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ గా టెస్ట్ చేయించుకోగా కోవిడ్ నెగటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. రాం చరణ్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా ఆ మరుసటి రోజు వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు వెళ్లడించారు.
రాం చరణ్ కు ఇంకా నెగటివ్ రాలేదు కాని వరుణ్ తేజ్ లేటెస్ట్ రిపోర్ట్స్ లో కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కు కరోనా నెగటివ్ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. అయితే రాం చరణ్ కు మాత్రం నెగటివ్ రిపోర్ట్ వచ్చిన విషయాన్ని వెళ్లడించలేదు. నెగటివ్ రిపోర్ట్ రావాడం చాలా సంతోషంగా ఉంది.. యెస్ ఐ టెస్టెడ్ కోవిడ్ నెగటివ్. తనపై ప్రేమని చూపి, తన కోసం ప్రార్ధనలు చేసిన వారందరికి ధన్యవాదాలు అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 7, 2021