
నాచురల్ స్టార్ నాని రమేష్ వర్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా రైడ్. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు. సినిమాలో నాని, తనీష్ ఇద్దరు కలిసి నటించారు. రైడ్ సినిమాలో తనకు ఇష్టం లేకుండా బలవంతంగా చేయించారు అన్నాడు నాని. ముందు ఒప్పుకున్నా సరే ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్లి చెబుదామని అనుకుంటే సినిమాపై నమ్మకం ఉంచమని చెప్పారని వాళ్లు చెప్పినట్టు గానే సినిమా సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో సంక్రాంతి కానుకగా అల్లుడు అదుర్స్ సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ లో నాని గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో భాగంగా నాని తన రైడ్ సినిమా విషయాలను పంచుకున్నారు. ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ ప్రేక్షకులను మెప్పిస్తాడని అన్నారు నాని.