
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. కె.జి.ఎఫ్ నిర్మాతలతో ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీగా సలార్ రాబోతుంది. ఇక ఈ సినిమాలో దిశా పటాని, సాయి పల్లవి హీరోయిన్స్ గా తీసుకుంటున్నట్టు టాక్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి కాగానే సలార్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా సలార్ నుండి వచ్చిన ప్రభాస్ పోస్టర్ కూడా అంచనాలు పెంచింది. అయితే సలార్ సినిమా విలన్ గా ఎవరు నటిస్తున్నారన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 లో అధీరగా నటిస్తున్న సంజయ్ దత్ నటిస్తున్నాడు. సలార్ సినిమాలో కూడా విలన్ గా సంజయ్ దత్ చేస్తాడని టాక్. అయితే సంజయ్ కాకుండా జాన్ అబ్రహంని కూడా సినిమా అడుగుతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సలార్ సినిమా అఫీషియల్ కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.