
లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య చేస్తున్న సినిమా థ్యాంక్యు. విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో నాగ చైతన్య మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్ గా చైతు సందడి చేయనున్నాడు. నాగ చైతన్య సూపర్ స్టార్ ఫ్యాన్ అనగానే థ్యాంక్యు సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తి కలిగేలా చేసింది. మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య రాబోతున్న సినిమాలతో ఆ సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.