
ప్రముఖ పాట రచయిత వెన్నెలకంటి (64) మంగళవారం గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. తెలుగు, తమిళ సినిమాలకు రచయితగా పనిచేసిన వెన్నెలకంటి అసలు పేరు రాజేశ్వర ప్రసాద్. 300 సినిమాల్లో 2 వేల పాటలు ఆయన రచించడం విశేషం. తమిళ సినిమాలు తెలుగులో అనువాదం చేయడంలో వెన్నెలకంటి పాత్ర చాలా కీలకం. లిరిసిస్ట్ గానే కాదు మాటల రచయితగా కూడా వెన్నెలకంటి ఎన్నో సినిమాలకు పనిచేశారు.
విద్యార్ధి దశలోనే రైటింగ్ మీద ఆసక్తి ఉన్న వెన్నెలకంటి చిన్నతనంలోనే రామచంద్ర శతకం, లలితా శతకం రాశారు. సినిమాల మీద ఆసక్తితో రచయితగా కొనసాగాలనే ఉద్దేశంతో SBI ఉద్యోగాన్ని కూడా వదిలేశారు వెన్నెలకంటి. 1986లో శ్రీరమచంద్రుడు సినిమాకు తొలి పాట రాశారు వెన్నెలకంటి. 1988ల్ఫ్ మహర్షి సినిమాలో వెన్నెలకంటి రాసిన మాట రాని మౌనమిది పాట సూపర్ హిట్ అయ్యింది. వెన్నెలకంటి మృతి పట తెలుగు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.