'అల్లుడు అదుర్స్' ట్రైలర్.. బెల్లంకొండ మార్క్ మాస్ ఎంటర్టైనర్..!

బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. సుమంత్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ హోలా చికా సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ ప్లాన్ చేసిన అల్లుడు అదుర్స్ సినిమా నుండి ట్రైలర్ రిలీజైంది.

ఈ ట్రైలర్ చూస్తే ఈ సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ హంగామా బాగానే ఉండేలా అనిపిస్తుంది. కామెడీ, యాక్షన్ కలిసి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తన ప్రతిభ చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సంక్రాంతికి వస్తున్న మరో మూడు సినిమాల పోటీలో అల్లుడు నిజంగానే అదుర్స్ అనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా సోనూ సూద్ సెకండ్ విలన్ గా నటించాడని తెలుస్తుంది. నభా అంటేష్ తో పాటుగా అను ఇమ్మాన్యుయెల్ కూడా మరో హీరోయిన్ గా కనిపిస్తుంది.