
సూపర్ స్టార్ మహేష్ గీతా గోవిందం డైరక్టర్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ సెటైర్ మూవీగా వస్తున్న ఈ మూవీ మహేష్ సిస్టర్ రోల్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తుందని తెలుస్తుంది. పవన్ కు దూరమై పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రేణు దేశాయ్ సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధమైంది.
ఆద్య అంటూ ఓ వెబ్ సీరీస్ చేస్తున్న రేణు దేశాయ్ మరో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ మహేష్ సినిమాలో నటించడం. సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చూసే అవకాశం ఉంది. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. టైటిల్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచిన పరశురాం త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ ఇయర్ దసరాకి సర్కారు వారి పాట రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.