
మెగాపవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక చరణ్ చేసే నెక్స్ట్ సినిమాపై అప్పుడే ప్రచారం మొదలైంది. త్రివిక్రం, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ ముగ్గురు దర్శకుల్లో చరణ్ ఒకరితో సినిమా చేస్తాడని అన్నారు. అయితే లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో అందరి కన్నా ముందు ఉన్నాడు కోలీవుడ్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్.
తమిళంలో ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత ఇళయదళపతి విజయ్ తో మాస్టర్ సినిమా చేశాడు. సంక్రాంతి బరిలో మాస్టర్ రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్రమోషన్స్ లో లోకేష్ కనగరాజ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా చేస్తానని చెప్పాడు. ఇప్పటికే చరణ్ కోసం ఓ కథ రెడీ చేయడం అది మెగా హీరోకి వినిపించడం జరిగిందట. లైన్ నచ్చిన చరణ్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. మొత్తానికి లోకేష్ తో రాం చరణ్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కాంబో సెట్ అయితే మాత్రం సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉంటాయని తెలుస్తుంది.